గ్యాస్ ఆఫీస్‌ను తనిఖీ చేసిన తహాసిల్దార్
CTR: పుంగనూరు పట్టణంలో గల గ్యాస్ ఆఫీస్‌ను సోమవారం తహాసిల్దార్ రాము ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అలాగే గ్యాస్ గోడౌన్ పరిశీలించారు. గ్యాస్ సరఫరా సజావుగా జరుగుతూ ఉందని చెప్పారు. ప్రజలు లేనిపోని అపోహలు నమ్మవద్దని సూచించారు. తర్వాత కొత్తపేటలోని మరో గ్యాస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.