భారీ వర్షాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ELR: జిల్లాలో భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో కలెక్టరేట్‌లో 1800-233-1077/94910 41419, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్‌లో 83092 69056, నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08656-232717 మూడు చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అత్యవసర సమయంలో ఈ నెంబర్లను సంప్రదించాలని కోరారు.