'బంతిపూలకు ఫుల్ డిమాండ్'
SDPT: జగదేవ్పూర్ మండలం వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ రేపు కావడంతో బంతి పువ్వులు రోడ్డుపై పోసి అమ్ముకుంటున్నారు. అలాగే బతుకమ్మ, దసరా పండగలు పూల రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పూల సాగు కొంత దెబ్బతిన్నప్పటికీ, చేతికొచ్చిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు సంతోషపడుతున్నారు.