'ప్రభుత్వ స్వీపర్ల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి'
WNP: ప్రభుత్వ స్వీపర్ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోషే డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల జీతాలను చెల్లించకపోవడం దారుణం అన్నారు. వేతనాల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలని స్వీపర్లకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని కోరారు.