నూతన ఎస్సైగా సుబ్బారావు బాధ్యతలు స్వీకారం

నూతన ఎస్సైగా సుబ్బారావు బాధ్యతలు స్వీకారం

ASF: తిర్యాణి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పీ. సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి బదిలీపై అయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.