విషాదం.. తండ్రిని హతమార్చిన కొడుకు
పెద్దపల్లి పట్టణంలో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన జబీర్ లారీ డ్రైవర్‌ను అతని కొడుకు ఇటుకతో బాది హత్య చేసినట్లు సమాచారం. మద్యానికి డబ్బులు అడగడంతో ఘర్షణపడి హత్య చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.