ఈనెల 7న మండల సర్వసభ్య సమావేశం

ఈనెల 7న మండల సర్వసభ్య సమావేశం

ASR: ఈనెల 7వ తేదీన గూడెం కొత్తవీధి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో రమణబాబు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చలు, పదవీకాలం ముగిసిన తాజా సర్పంచులు, ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.