డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు

ASR: జిల్లా ఎస్పీ ఆదేశాలతో అరకు సర్కిల్ పరిధిలో శుక్రవారం సీఐ హిమగిరి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ అకస్మిక తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, అరకు, గోరాపూర్ రైల్వే స్టేషన్లు, అరకు బస్ స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల బ్యాగులను డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.