విద్యార్థుల కోసం ఇంటి బాట పట్టిన ఉపాధ్యాయులు

విద్యార్థుల కోసం ఇంటి బాట పట్టిన ఉపాధ్యాయులు

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఇంటి బాట పడుతున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయింది.