నేడు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి పర్యటన

నేడు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి పర్యటన

BPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ అద్దంకి మండలంలో పర్యటిస్తారని ఆయన క్యాంప్ కార్యాలయం సిబ్బంది తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పేరాయపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.