వరంగల్ హైవేపై మరో బస్ స్టాప్..!
MDCL: వరంగల్ జాతీయ రహదారి-163పై అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఘట్‌కేసర్ సర్కిల్ DONO సమీపంలో అధికారులు బస్ స్టాప్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆర్టీసీ బస్సులకు హాల్టింగ్ కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఘట్‌కేసర్ బైపాస్ నుంచి డైరెక్ట్‌గా ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.