ఎడ్లపాడులో పేకాట ఆడుతున్న వ్యక్తులు అరెస్ట్
PLD: ఎడ్లపాడు మండలం కోట గ్రామంలో కోత ముక్క ఆడుతున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు దాడి చేసి, వారి వద్ద నుంచి రూ. 650 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను హెచ్చరించారు.