52 మందిని కత్తులతో నరికి చంపారు

కాంగోలోని తూర్పు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు దారుణానికి ఒడిగట్టారు. కాంగో దళాల చేతిలో చావుదెబ్బ తిన్న కోపంతో, అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై అమానుషంగా దాడి చేశారు. ఈ ఊచకోతలో 52 మందిని కత్తులతో నరికి చంపారు. తిరుగుబాటుదారుల ఈ అమానుష చర్యపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.