'మత్తు ఉచ్చులో యువత' పోస్టర్ల ఆవిష్కరణ

NRPT: జిల్లా కేంద్రంలో PYL ఆధ్వర్యంలో 'మత్తు ఉచ్చులో యువత' అనే పోస్టర్లను CI శివకుమార్, SI గాయత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CI, PYL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువత డ్రగ్స్, గంజాయి, మద్యం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులను ఎత్తివేయాలన్నారు.