సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

విశాఖ: సీఎం సహాయ నిధి నుండి నలుగురికి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రూ.5 లక్షల 47 వేల నగదు చెక్కును అందజేశారు. నర్సీపట్నం మండలంలోని అమలాపురం గ్రామానికి చెందిన బొట్టా కృష్ణ లావణ్యకు రూ.4 లక్షలు, చెట్టుపల్లికి చెందిన జి. వెంకట లక్ష్మీకి రూ.లక్ష, ఆదికుమారికి రూ. 27 వేలు, దుగ్గాడకు చెందిన నల్లబెల్లి సత్యవతికి రూ. 20 వేల చెక్కులను ఎమ్మెల్యే అందించారు.