బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎంపీ

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎంపీ

ADB: ఇంద్రవెల్లి మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన మాడవి శ్రీకాంత్ ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు బాధిత కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు, రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు.