ఆకస్మికంగా ఉపాధ్యాయుడు మృతి

ASR: కొయ్యూరు మండలం శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న కంకిపాటి సత్యనారాయణ(56) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. మృతునికి కుమారుడు కుమార్తె వున్నారు. ఆయన అంత్యక్రియలు నేడు స్వగ్రామం శరభన్నపాలెంలో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సత్యనారాయణ ఆకస్మిక మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.