VIDEO: 'తులాభారంలో మోసాలపై నివేదిక బయటపెట్టాలి’

VIDEO: 'తులాభారంలో మోసాలపై నివేదిక బయటపెట్టాలి’

TPT: తిరుమల శ్రీవారిని టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో శ్రీవారి ఖజానాకు రక్షణ లేకుండాపోయిందని ఆరోపించారు. స్వామివారికి రోజుకు రూ.10లక్షలు తులాభారం రూపంలో వస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తులాభారంలో మోసాలపై టీటీడీ విజిలెన్స్ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.