ఒడిశా విద్యాశాఖ కమిషనర్‌గా తిరుమల నాయక్
NDL: నంద్యాల జిల్లా అవుకుకు చెందిన ఐఏఎస్ అధికారి డా.ఎన్.తిరుమల నాయక్‌కు ఒడిశా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఆ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీగా నియమించింది. దీంతో నాయక్ బాధ్యతలు చేపట్టారు. 2009 IAS బ్యాచ్‌కు చెందిన తిరుమల నాయక్ ఒడిశా కార్మిక శాఖ కమిషనర్, CEO, BDA ఎండీగా పనిచేశారు. కాగా, గతంలో సంజామల పశువైద్యాధికారిగా పని చేశారు.