చిత్తడి నేలలను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

చిత్తడి నేలలను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలి: కలెక్టర్

ADB: జిల్లాలోని చిత్తడి నేలలను గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చిత్తడి నేలల సర్వే, సరిహద్దుల గుర్తింపు అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25లోగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి నివేదికను సమర్పించాల్సిందిగా కోరారు.