పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MBNR: జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం మూసాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై ఉన్న వర్ణమాల, సరళ పదాలను విద్యార్థులతో చదివించి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అక్షయపాత్ర ద్వారా అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.