VIDEO: సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపు
WG: జనవరి 4న విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి పి.వి ప్రతాప్ కోరారు. గురువారం తణుకులో సీఐటీయూ మహాసభలు కరపత్రాలను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభకు కార్మికులు తరలి రావాలని, కార్మికులకు అన్యాయం చేసే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.