గోకవరంలో కోటి సంతకాల సేకరణ
E.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం గోకవరం దేవి చౌక్ సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రాంజీ పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.