సమ్మె నోటీసులు అందజేత

KMM: కేంద్రం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘం నాయకులు మద్దాల ప్రభాకరరావు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఎర్రుపాలెం మండల ఎంపీడీవో, ఎంపీఓ కార్యాలయాల్లో అధికారులకు గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.