'స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా'

కాకినాడ: పెద్దాపురం డివిజన్‌లో గర్భస్థ శిశు నిర్ధారణ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంటుందని పెద్దాపురం ఆర్డీవో కె.శ్రీ రమణి పేర్కొన్నారు. భ్రూణహత్యలు, అనధికార స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. డిప్యూటీ డిఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎవరైనా అనధికారకంగా స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.