'సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SDPT: మద్దూరు మండలం రేబర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి ఏఎస్సై సదాశివరావు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందన్నారు. మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని సూచించారు.