నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
VKB: చౌడపూర్ మండలానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇవాళ రానున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పాటి అశోక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. చౌడాపూర్, వీరాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.