బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: వరంగల్ నుంచి కొండపర్తి వరకు వయా తిమ్మాపూర్, సింగారం, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల మీదుగా వెళ్లే బస్సు సర్వీసును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.