మున్సిపల్ బరిలో అభ్యర్థులు ఎంతమందంటే..!
నారాయణపేట: మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల పోటీ స్పష్టమైంది. మొత్తం 24 వార్డులకు గాను 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తలో 24 మంది, కాంగ్రెస్ నుంచి 22 మంది, ఎంఐఎం నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదనంగా 21 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.