మావుళ్ళమ్మ నిత్యాన్నదాన భవనానికి శంకుస్థాపన
W.G: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదానంకు భవనం లేక భక్తులు, దేవస్థానం సభ్యులు ఇబ్బందులు పడేవారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇవాళ శ్రీమావుళ్ళమ్మ నిత్యాన్నదాన భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇక ఆ సమస్య తీరినట్లేనని, ప్రతి రోజు సుమారు 2 వేల మంది భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణ జరిగేలా స్థలం ఏర్పాటు అయ్యిందన్నారు.