హైదరాబాద్‌లో.. మరో ఈవెంట్ గ్రౌండ్
HYD: నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న పీపుల్స్ ప్లాజా మైదానం ప్రఖ్యాతిగాంచింది. దానికి అతి సమీపంలోనే హైటెక్ హంగులతో మరో ఈవెంట్ మైదానం సిద్ధమవుతోంది. ప్రదర్శనలు, రాజకీయ సమావేశాలు నిర్వహించుకునేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేస్తున్నది. ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ముస్తాబు చేస్తున్నది.