'నన్ను మోసం చేశారు.. నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి'

'నన్ను మోసం చేశారు.. నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి'

ASF: చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడా గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి, తనను ఓడించిన గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం ఇంటింటికీ తిరిగి తాను పంపిణీ చేసిన డబ్బులను వెనక్కి అడిగారు. తన దగ్గర డబ్బులు తీసుకొని ఓటు వేయకుండా ప్రజలు తనను మోసం చేశారని  అభ్యర్థి వాపోయారు.