గూడూరు సమస్యలు పరిష్కరించాలని కార్మికుల సమ్మె

KRNL: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తమ సమస్యల పరిష్కారానికై కార్మికులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు గూడూరులో కార్మికులు ఆరవింద్, జయన్న, బసవరాజు, షబ్బీర్ తెలిపారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం 15సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు.