భగీరథ మహర్షి జీవిత చరిత్ర యువతకు ఆదర్శం: కలెక్టర్

KRNL: భగీరథ మహర్షి జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. ఆదివారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.