బండవేషంలో గంగమ్మను దర్శించుకున్న భక్తులు

TPT: తిరుపతిలో కన్నులపండువగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం బండవేషంలో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకున్నారు. శరీరమంతా కుంకుమ రాసుకుని కాటుక బొట్లు, తెల్లని పూలు చుట్టుకుని, వేపాకు, కర్రలు చేతపట్టుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.