ఉచిత ఇసుకను అమల్లోకి తీసుకురావాలి: సీపీఎం

KRNL: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు, సీపీఎం నాయకులు సాహెబ్, గోపాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. నందికొట్కూరులో వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులతో పాటు యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.