'సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చెయ్యండి'
PPM: మక్కువ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న గ్రీన్ అంబాసిడర్లను విధుల నుంచి తొలగించమని ఈవో బెహరా శ్రీనివాస్‌ను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. గ్రీన్ అంబాసిడర్లకు విధుల నుంచి తొలగించడంతో పాటు సచివాలయంలో పనిచేస్తున్న 9 మంది సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఎంపీడీవోకు ఆదేశించారు.