అవనిగడ్డలో డ్వాక్రా మహిళలపై ఘరానా మోసం

అవనిగడ్డలో డ్వాక్రా మహిళలపై ఘరానా మోసం

కృష్ణా: అవనిగడ్డలో డ్వాక్రా మహిళలపై ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లంకమ్మ మాన్యం కాలనీకి చెందిన బుక్‌కీపర్ విశ్వనాథపల్లి నాగమల్లేశ్వరి గ్రూపు సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.25 లక్షలు కాజేసి కుటుంబంతో పరారైంది. బాధితులు కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. వెంటనే నిందితురాలిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.