నేడు కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ

నేడు కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ

AP: విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఈరోజు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో ఐటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఐటీ క్యాంపస్‌ను సంస్థ మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనుంది. దీంతో 8 వేల మందికి ఉపాధి లభించనుంది.