పొదిలి ఆర్టీసీ డిపో వద్ద ప్రమాదం

పొదిలి ఆర్టీసీ డిపో వద్ద ప్రమాదం

ప్రకాశం: పొదిలి ఆర్టీసీ డిపో వద్ద ఒక యాచకుడిని బుధవారం రాత్రి మార్కాపురం ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. మార్కాపురం వెళ్లే క్రమంలో వేప చెట్టు కింద పండుకొని ఉన్న యాచకుడిని గమనించక ఆర్టీసీ బస్సు కాళ్ళు మీదుగా వెళ్ళింది. యాచకుడి రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. వెంటనే బస్సు డ్రైవర్ ఓ ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.