నీటిలోనూ విద్య కోసం అడుగులు
RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం సోలిపూర్ గ్రామానికి చెందిన తండా విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లడం సవాలుగా మారింది. గ్రామానికి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు నిలిచి పోవడంతో విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ పాస్ దగ్గర నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.