VIDEO: ఆస్పత్రిలో నీటి కొరత.. ట్యాంకర్ల ద్వారా సరఫరా
అన్నమయ్య: మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. బుధవారం మున్సిపల్ నీళ్ల ట్యాంకర్ల ద్వారా ఆసుపత్రిలోని డ్రమ్ములను నింపినట్లు RMO రాధిక తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అవసరాల కోసం రోజుకు 5 ట్యాంకర్ల నీరు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.