'రివర్ ఫ్రంట్‌తో మారనున్న గోదావరిగట్టు రూపురేఖలు'

E.G: రూ.8 కోట్లతో నిర్మించనున్న రివర్ ఫ్రంట్‌తో గోదావరిగట్టు రూపురేఖలు మారనున్నాయని, దీనికి ఈ నెల 7న శంకుస్థాపన చేస్తున్నట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 9వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో రూ. 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.