ఆత్మ రక్షణ‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ఆత్మ రక్షణ‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ATP: గుంతకల్లు SKP ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకం కింద విద్యార్థులకు ఆత్మరక్షణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా.లక్ష్మయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు శారీరక దృఢత్వం,ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణ అవసరమని తెలిపారు. తైక్వాండో కోచ్ సంత రాజ్ ఆత్మరక్షణకు సంబంధించిన ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు.