పెళ్లయ్యాక HYD చుట్టేయాలనుకున్నా.. కానీ!: శోభిత
పెళ్లయ్యాక హైదరాబాద్ మొత్తం చుట్టేలయాలని అనుకున్నట్లు నాగచైతన్య సతీమణి, నటి శోభిత తెలిపారు. కానీ రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో కుదరటం లేదని చెప్పారు. వివాహం తర్వాత 160 రోజుల పాటు షూటింగ్స్‌లో పాల్గొన్నానని, అందువల్ల తమిళనాడులోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా, నాగచైతన్య-శోభిత వివాహం గతేడాది డిసెంబర్-4న జరిగిన విషయం తెలిసిందే.