VIDEO: భూమి కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
WGL: రాయపర్తి మండలం కొండాపూర్ గ్రామ శివారులోని నల్లకుంట మడుగు వద్ద ఈనెల 5వ తేదీన తన అన్న కొండ వీరాస్వామిని హత్య చేసిన కేసులో, తమ్ముడు కొండ వెంకన్నను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. భూ వివాదాల కారణంగా గత 30 ఏళ్లుగా సమస్యలు ఉన్న వీరాస్వామిపై వెంకన్న దాడి చేసి హత్య చేసినట్లు ACP నరసయ్య తెలిపారు. సీఐ శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.