పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు

పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు

AP: కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఊరకొండలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గత 16 రోజులుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే తిరుగుతున్న పులి, ప్రస్తుతం మండపం గ్రామంలోని వేపాలమ్మకొండపై ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.