మంగళ రూపినిగా శ్రీ విరుపాక్షి మారమ్మ

మంగళ రూపినిగా శ్రీ విరుపాక్షి మారమ్మ

CTR: పుంగనూరు అర్బన్ మున్సిపల్ బస్టాండ్ సమీపంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా మంగళ రూపిని అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి మూలవర్లకు ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత కుంకుమ, గంధం, కాటుకతో మంగళ రూపినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు మారెమ్మను దర్శించుకున్నారు. మహిళలు నిమ్మకాయ దీపాలు వెలిగించారు.