పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

కోనసీమ: రాబోయే పుష్కరాలు ఏర్పాట్లపై కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఘాట్ల మరమ్మతులు, తాత్కాలిక మరుగుదొడ్లు, అప్రోచ్ రోడ్లు, ప్రత్యేక గదుల నిర్మాణానికి అంచనాలను రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని పనులను సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.