ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపిన భర్త

MBNR: మూసాపేట మండలం పోల్కంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న చందు, గొడవ కారణంగా తన భార్య శ్రీదేవిని (19) కొట్టి హత్య చేశాడు. నర్సుగా పనిచేస్తున్న శ్రీదేవి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న చందును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.